Home » Telangana Congress
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది’ అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ రాజకీయం మొదలైంది.
కరోనా సమయంలో సీతక్క చేసిన సేవా కార్యక్రమాల గురించి ఇప్పటికీ ప్రజలు పలు సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇతరుల తరహాలో ఎలాంటి తాయిలాలు ప్రకటించకపోయినా ఎన్నికల్లో ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే ఇటీవల ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు..
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు..
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని సమాచారం అందుతోంది.
అవును.. తెలంగాణలో ఎన్నికల (TS Elections) సీజన్ వచ్చేసింది.. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్షపార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు, బహిరంగ సభలు నిర్వహించేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉంది కాంగ్రెస్..
ఇటీవల కర్ణాటకలో విజయం సాధించడం ఆ పార్టీలో జోష్ నింపింది. అక్కడ ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించడం ఆ పార్టీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ఆ పార్టీ పావులు కదుపుతోంది.
జనగర్జన సభావేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీఆర్ఎస్‌పై (BRS) చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు...
తెలంగాణ కాంగ్రెస్ చేరికలతో కళకళలాడుతోంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా పార్టీకి ఎనలేని జోష్ వచ్చింది.. మునుపటిలా కొట్లాటల్లేవ్.. నేతలంతా ఒక్కటై కలిసిమెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తు్న్నారు..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy).. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు (TS Politics) ఈయన చుట్టూనే తిరిగాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరించిన తర్వాత పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) కాషాయ కండువా కప్పాలని కమలనాథులు, హస్తం గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) విశ్వప్రయత్నాలు చేశారు..