Home » Telangana Election2023
అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపికచేసే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ నెలలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తుందని టాక్ నడిచింది కానీ.. ఆగస్టులో సగం నెల పూర్తయ్యినప్పటికీ ఇంతవరకూ చలీ చప్పుడు లేదు..
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..
అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మళ్లీ మొత్తం మార్చేశారు..! రెండు నెలలుగా ఇదిగో.. అదిగో అంటూ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాపై (BRS Mla candidates) ఊరిస్తూనే వస్తున్నారు.! మొదట జూన్‌లో అని.. ఆ తర్వాత జూలై-10, 12 తారీఖుల్లో అని.. ఆ తర్వాత ఆగస్టు 12 లేదా 13 తారీఖు జాబితా ప్రకటన ఉంటుందనే పుకార్లు షికార్లు చేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఇవాళ జాబితా బయటికి రావాల్సి ఉంది. సీన్ కట్ చేస్తే..
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది...
తెలంగాణలో ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వరని పుకార్లు నడుస్తుండగా.. మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు ‘కారు’ దికి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోతున్నారు. ఇంకొందరేమో తొలి జాబితా చూశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..
తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..!..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు (Congress, BJP) ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని వాళ్లంతా సిట్టింగ్‌లేనని పదే పదే గులాబీ బాస్ చెబుతున్నారు. అయితే లోలోపల మాత్రం సీన్ వేరేలా ఉందని తెలుస్తోంది...
కర్ణాటకలో (Karnataka) ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అక్షరాలా నిజమవుతున్నాయ్.. ఒకట్రెండు తప్ప మిగిలిన సర్వే సంస్థలన్నీ కర్ణాటక కాంగ్రెస్‌దే (Congress) అని తేల్చి చెప్పేశాయి. అనుకున్నట్లుగానే..
తెలంగాణలోని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న సరళిని గమనిస్తే పార్టీలన్నీ ఒక వర్గం ఓట్లపై ఫుల్ ఫోకస్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వర్గం ఓటర్లు తమవైపు ఉంటే అధికారాన్ని సులభంగా హస్తగతం చేసుకోవచ్చని నేతలు భావిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.