TS Politics : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. 42 మంది నేతల రాజీనామా..!

ABN , First Publish Date - 2023-07-23T18:43:55+05:30 IST

తెలంగాణలో ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వరని పుకార్లు నడుస్తుండగా.. మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు ‘కారు’ దికి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోతున్నారు. ఇంకొందరేమో తొలి జాబితా చూశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

TS Politics : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. 42 మంది నేతల రాజీనామా..!

తెలంగాణలో ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వరని పుకార్లు నడుస్తుండగా.. మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు ‘కారు’ దికి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోతున్నారు. ఇంకొందరేమో తొలి జాబితా చూశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన 42 మంది బీఆర్ఎస్ నాయకులు (42 BRS Leaders) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది బీఆర్ఎస్‌కు కలలో కూడా ఊహించని ఝలక్ అని చెప్పుకోవచ్చు.


T-Congress.jpg

అసలేం జరిగిందంటే..!

ఇటీవల గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత (Saritha) రాజీనామా చేసి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే (Mallikarjuna Kharge) నేతృత్వంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అధ్యక్షతన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల్ నుంచి (Gadwal) పోటీచేయాలని ప్లాన్ చేశారేమో కానీ.. బీఆర్ఎస్‌లోని ద్వితియ శ్రేణి నేతలను, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తన వెంటే కాంగ్రెస్ బాట పట్టేలా సరిత, ఆమె భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు. ఒకేసారి.. 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలను కాంగ్రెస్‌లో చేర్చారు. గాంధీ భవన్ వేదికగా.. రేవంత్ సమక్షంలో 42 మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు గద్వాల్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేతలందరికీ కండువా కప్పిన రేవంత్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇటీవలే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

Saritha-and-Revanth-Reddy.jpg

కాంగ్రెస్ కంచుకోట!

చేరికల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కంచుకోటనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలమూరులో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని జిల్లా ప్రజలను రేవంత్ కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగులందరికీ సీట్లిచ్చి.. గజ్వేల్‌ నుంచి గులాబీ బాస్ పోటీచేయాలని మరోసారి రేవంత్ సవాల్ చేశారు. ఈ చేరికల కార్యక్రమంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఇతర పీఏసీ సభ్యులతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్‌‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చిస్తున్నారు.

congress.jpg


ఇవి కూడా చదవండి


Telangana Weather Updates : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


TS Politics : బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. రాజీనామా సిద్ధమైన కీలక నేత.. అదే బాటలో మరికొందరు!


AP Politics : ఏపీ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్.. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్..!


Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?


Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!


Updated Date - 2023-07-23T18:49:16+05:30 IST