Home » Telangana Election2023
Telangana Election Result 2023 : తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎందుకిలా చేశారో.. ఎవరికీ అర్థం కాలేదు. తమ సత్తా చూపించుకోవడానికో.. లేదంటే టెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ.. రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు...
NRI Missing Vote in Mancherial District: ఓ వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా అని సప్తసాగరాలు దాటి వచ్చాడు. తీరా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆ ఎన్నారైకి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓటు వేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడ తన ఓటు లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు.
Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్‌ఎస్ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Election Exit Polls -2023 : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు...
తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
KA Paul: ఎన్నికలు వచ్చినప్పుడు ‘ఓటు హక్కును వినియోగించుకోవాలని, భవిష్యత్తుని మెరుగ్గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న నాయకుడికి మాత్రమే ఓటు వేయాలని’ ప్రతిఒక్కరూ పిలుపునిస్తారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ హడావుడి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా.. రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది.
Telangana Polls: కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఆమె ఓటు వేశారు. కాగా, ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
Telangana Polls: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య వస్తే.. అక్కడ కొత్తవి మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని అన్నారు. ఇక నుంచి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana Elections 2023: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.