Share News

Election Exit Poll Results 2023 : ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

ABN , First Publish Date - 2023-11-30T17:06:16+05:30 IST

Election Exit Polls -2023 : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు...

Election Exit Poll Results 2023 : ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పడంతో.. అనుకున్నట్లుగానే ప్రముఖ సర్వే సంస్థలు కొన్ని మీడియా మీట్‌లు పెట్టి.. మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే.. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చగా.. కాంగ్రెస్‌దే అధికారమని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.


TG-Map-and-Parties.jpg

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :-

పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌

కాంగ్రెస్‌ : 65-68

బీఆర్ఎస్‌ : 35-40

బీజేపీ : 07-10

ఇతరులు : 06-09

చాణక్య స్ట్రాటజీస్‌

కాంగ్రెస్‌ : 67-78

BRS : 22-31

బీజేపీ : 06-09

MIM : 06-07

సీ-ప్యాక్‌

కాంగ్రెస్‌ : 65

BRS : 41

బీజేపీ : 04

ఇతరులు : 09

ఆరా

బీఆర్ఎస్ : 41-49

కాంగ్రెస్ : 58-67

బీజేపీ : 05-07

ఇతరులు : 07-09

AAARA.jpg

పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71

కాంగ్రెస్ : 37-38

బీజేపీ : 03-05

ఎంఐఎం : 06

ఇతరులు : 01

సీఎన్ఎన్ న్యూస్-18

బీఆర్ఎస్ : 48

కాంగ్రెస్ : 56

బీజేపీ : 10

ఎంఐఎం : 05

ఇతరులు : 00

టీవీ9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్

బీఆర్ఎస్ : 48-58

కాంగ్రెస్ : 49-59

బీజేపీ : 05-10

ఎంఐఎం : 06-08

ఇతరులు : 00

రిపబ్లిక్ టీవీ

బీఆర్ఎస్ : 46-56

కాంగ్రెస్ : 58-68

బీజేపీ : 04-09

ఎంఐఎం : 05-07

ఆత్మ సాక్షి

బీఆర్ఎస్ : 58-63

కాంగ్రెస్ : 48-51

బీజేపీ : 07-08

ఎంఐఎం : 06-07

ఇతరులు : 01-02

సీ-ప్యాక్

బీఆర్ఎస్ : 41

కాంగ్రెస్ : 65

బీజేపీ : 04

ఎంఐఎం : 04

ఇతరులు : 04

ఇండియా టీవీ- సీఎన్ఎక్స్

బీఆర్ఎస్ : 31-47

కాంగ్రెస్ : 63-79

బీజేపీ : 02-04

ఎంఐఎం : 05-07

ఇతరులు : 00

Updated Date - 2023-11-30T19:42:09+05:30 IST