Home » Telangana Election2023
Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ మొత్తంలో క్యూలైన్లలో బారులు తీరారు.
Telangana Elections 2023: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారం మండలం కోమట్లగూడెంలో పోలింగ్ నిలిచిపోయింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈవీఎం బ్యాలెట్‌పై ఇంక్ అంటించాడు. దాంతో ఓ గుర్తు సరిగా కనిపించకపోవడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.
Telangana Polls: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లతో డీఎస్పీ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు.
Telangana Polls: జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హల్‌చల్ చేశారు. జనగామ ప్రెస్టన్ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 252, 262, 249లలో ఆయన తిష్టవేశారంటూ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Telangana Elections 2023: రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే, ఇప్పటివరకు మెజారిటీ ప్రాంతాలలో పోలింగ్ సజావుగానే కొనసాగుతోంది.
Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 33వ బూత్‌లో ఈవీఎంలు మొరయించడంతో అర్ధగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
Telangana Polls: సత్తుపల్లి పట్టణంలోని బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని తన స్వంత గ్రామం అంతర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఓటు వేశారు.
Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నేం. 118 లో ఈవీఎం మోరాయించింది.
Telangana polls: మరికొద్దిసేపటిలో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. సుమారు 3.26కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Telangana Elections 2023: తెలంగాణలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది.