Home » Telangana High Court
Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి.
Andhrapradesh: మార్గదర్శి కేసుల బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మార్గదర్శికి సుప్రీం ధర్మాసనం సూచించింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం(Vyuham Movie) సినిమాపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.
Telangana: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సాహిల్‌ను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం తెలిపింది. పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది.
Andhrapradesh: భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది.
వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: దిశ కేసు ఎన్కౌంటర్ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కమిషన్ నివేదికపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లపై తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్‌లో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Telangana: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి.