Harsha Sai: హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:12 PM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై పెట్టిన కేసు చెల్లదని హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం బుధవారం అతడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. హర్ష సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
జరిగిందిదే..
హర్షసాయిపై సెప్టెంబర్ 24న నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అత్యాచారం చేశాడంటూ హర్షసాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. హర్ష, అతడి తండ్రి రాధాకృష్ణ తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో యువతి పేర్కొంది. హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు.
బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు సమాచారం. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని ఆమె నిర్మించారట. బాధిత యువతి.. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు అయినప్పటి నుండి హర్ష సాయి ఎక్కడా కనిపించలేదు. తనపై నమోదైన కేసుపై న్యాయపర పోరాటానికి సిద్ధమని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. హర్ష సాయిను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు నుంచే తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ చాలాసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. బాధితురాలు కొన్నాళ్లకు హర్ష సాయి తండ్రిపైన కూడా కేసు పెట్టింది. ఇద్దరూ బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేయగా తాజాగా వారికి బెయిల్ మంజూరైంది.
ఇవి కూడా చదవండి...
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read Latet Telangana News And Telugu News