Home » Telangana High Court
వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: దిశ కేసు ఎన్కౌంటర్ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కమిషన్ నివేదికపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లపై తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్‌లో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Telangana: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి.
Telangana: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును మల్లారెడ్డి కోరారు.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.
Andhrapradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.