Home » Telangana News
నగరంలో కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ఈ-సిగరెట్స్(E-cigarettes) అమ్ముతున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు(TG NAB Police) అరెస్టు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి ప్రాంతాల్లో విద్యార్థులే లక్ష్యంగా మత్తు మందు కలిపిన ఈ-సిగరెట్స్ విక్రయిస్తున్న నిందితుల గుట్టురట్టు చేశారు.
అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
తెలంగాణలో(Telangana) పలువురు ఖైదీలకు పండుగ రోజు నేడు. అవును.. మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదులు(Prisoners) విడుదలవుతున్నారు. అంతేకాదండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది.
D Srinivas Passes Away : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీ శ్రీనివాస్(Dharmapuri Srinivas) భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్‌లోని(Nizamabad) డీఎస్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్.. ఆయన పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి..
తెలంగాణలో(Telangana) కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి.. ఇప్పుడు ఆ హామీల్లో కోతలు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు.
తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
సాధారణంగా దినసరి కూలీలు.. ఉద్యోగం లేకుండా గ్రామాల్లో ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తారనేది మనందరికీ తెలుసు. అందుకే దీనిని కరువు పని అని కూడా అంటారు. ప్రజలు కరువులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. అయితే తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పనిలో ఓ ఐఆర్ఎస్ అధికారి ప్రత్యక్షమయ్యారు.
TGPSC HWO Exam Date 2024: గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. టీజీపీఎస్సీ పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.
మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..