Crime News: బాలికపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని స్థానికులు ఏం చేశారంటే?
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:02 PM
అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్: అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
అంబర్‌పేట్‌లో స్థానికంగా ఉండే 14సంత్సవరాల బాలిక 8వ తరగతి చదువుతోంది. ఆమెపై నిందితుడు డేవిడ్ తరచుగా అత్యాచారానికి పాల్పడేవాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ చిన్నారిని బెదిరించేవాడు. తాజాగా మరోసారి లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గమనించారు. స్థానికులను చూసిన నిందితుడు వెంటనే పారిపోయేందుకు యత్నించాడు. వెంటపడి పట్టుకున్న యువకులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. డేవిడ్‌పై అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.