Medak Clashes: అరుణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్
ABN , Publish Date - Jun 16 , 2024 | 06:15 PM
మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..
హైదరాబాద్, జూన్ 16: మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తమ ఘోరక్షకులు పశువులు ఉన్నాయని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారని చెప్పారు రాజాసింగ్. కానీ, వాటిని కాపాడటంతో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నారు. నేరుగా వెళ్లి గోరక్షకులు వాటిని రక్షించే ప్రయత్నం చేశారన్నారు. అయితే, గోరక్షకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పోలీసులకు సమాచారం అందించగానే స్పందించి ఉంటే.. అరుణ్ రాజు గాయపడేవాడు కాదన్నారు.
హాస్పిటల్‌పైన.. డాక్టర్ కారుపైన దాడి చేసిన వారిపై కేసులు పెట్టారా? అని పోలీసులను రాజాసింగ్ ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కాకుండా.. బీజేపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఫాలో చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువులపై ఇంకా దౌర్జన్యాలు పెరిగాయన్నారు. బీజేపీ కార్యకర్తలకు, గోరక్షకులకు తాము అండగా ఉంటామని.. మెదక్‌లో గెలిచిన రఘునందన్ రావు అండగా ఉంటారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.