Home » Telangana News
మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాదులో అచ్చం అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. నగరంలోని అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
బల్దియా పరిధిలో భారీ అవినీతి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్ల స్కామ్ బట్టబయలైంది. అవును, ఈ అవినీతి అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు నిర్ధారించారు అధికారులు. జీహెచ్ఎంసీలో లేని కార్మికులకు రూ. 200 కోట్ల వేతనాలు చెల్లించారు అధికారులు. గత పదేళ్లుగా ఇదేతంతు జరిగిందని..
వరంగల్: తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితం(By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Heavy Rain in Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.
Telangana Formation Day by BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఈ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ రోజులను స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.
రైళ్లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బాలిక నిద్రిస్తోంది. బాలిక వద్దకు వెళ్లిన హోంగార్డు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన యువతి వెంటనే ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.