Share News

MLC Elections: నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్..

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:58 AM

వరంగల్: తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఫలితం(By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

MLC Elections: నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్..

వరంగల్: తెలంగాణ శాసనమండలి(Legislative Council) వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఫలితం(By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పోరు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52మంది ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.


ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో ప్రియారిటీతో కలిసి 18,962ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. మెుత్తం గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095. తీన్మార్ మల్లన్న గెలిచేందుకు ఇంకా 31,885ఓట్లు రావాలి. రాకేశ్ రెడ్డి గెలిచేందుకు 50,581ఓట్లు కావాలి. రెండో ప్రాధాన్యతలో కాంగ్రెస్‌కు 397ఓట్లు రాగా.. బీఆర్ఎస్‌కు 266 వచ్చాయి. ఇంకా ఫలితం తేలకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి:

TG politics: నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయనున్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ..

Students Protest: ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన..

Updated Date - Jun 07 , 2024 | 12:04 PM