Home » Telangana Police
Telangana: దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్‌నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా..
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై(Prabhakar Rao) రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు(Look Out Notice) జారీ చేశారు పోలీసులు.
Telangana: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది.
Telangana: అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...
విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా..
గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్‌కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో..
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.
Telangana: రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది.
Telangana: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.