TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్.. తిట్టేస్తున్నారు!
ABN , Publish Date - Apr 15 , 2024 | 03:56 PM
Telangana: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్‌లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
జయశంకర్‌భూపాలపల్లి, ఏప్రిల్ 15: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్‌స్టేషన్‌లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు (Telangana Police) తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్సులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ ఈ ఢ్యాన్స్ ఘటన ఏ పోలీస్‌స్టేషన్‌లో? ఎప్పుడు జరిగిందో? వివరాల్లో వెళితే..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..
జయశంకర్‌భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli) మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్యాన్స్ చేసింది అధికార పార్టీకి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత డ్యాన్స్ చర్చనీయాంశంగా మారింది. మహదేవ్‌పూర్ జడ్పీటీసీ గూడాల అరుణ భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆయన డ్యాన్స్‌ను స్టేష్‌లోని కానిస్టేబుల్లే ఎంకరేజ్ చేయడం విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలీస్‌స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్‌శాఖ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ వాకింగ్ కోసం వెళ్లి వస్తూ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడున్న కానిస్టేబుళ్లను పలకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన సంఘటనను ఉదహరిస్తూ ‘‘మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు’’ అని పోలీసులు పొగిడారు. అంతటితో ఆగకుండా డ్యాన్స్ చేయాలంటూ ఓ కానిస్టేబుల్ తన ఫోన్‌లో పాటను ప్లే చేశారు. హీరో నాగుర్జన నటించిన ‘‘నేనున్నాను’’ సినిమాలోని ‘‘నన్నేలు మన్మథుడా’’ పాటను ప్లే చేశారు. దీంతో శ్రీనివాస్ హుషారుగా డ్యాన్స్‌ను షురూ చేశారు. శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తుండగా పోలీసులు ఎంకరేజ్ చేశారు. ‘‘ఈ ఏజ్‌లోనే ఇలా ఉంటే.. ఆ ఏజ్‌లో ఎలా ఉండేవారో’’ అంటూ కానిస్టేబుల్స్ ఎంకరేజ్‌మెంట్‌తో పోలీస్‌స్టేషన్‌లోనే సదరు నేత చిందులు వేయడం వివాదాస్పదంగా మారింది. బాధితులకు న్యాయం జరగాల్సి చోటును డ్యాన్స్ క్లబ్‌గా మార్చారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జెడ్పీటీసీ భర్త చేసిన డ్యాన్స్ వీడియో బయటకు రావడంతో పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు పోలీసుల తీరుతో పాటు.. కాంగ్రెస్ నేత భర్త తీరును పలువురు తప్పుబడుతున్నారు. అయితే ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. శ్రీనివాస్‌ను గట్టిగా మందలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది.
ఇవి కూడా చదవండి...
Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు వార్నింగ్.. అసలేం జరిగిందంటే..!?
Bhagwant Mann: కేజ్రీవాల్‌కు జైలులో ట్రీట్‌మెంట్ దారుణం.. పంజాబ్ సీఎం భావోద్వేగం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...