Home » Telangana Politics
ప్రజా భవన్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని(KTR) శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ను ఆయన అభినందించారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు.
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాలేదని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Recanth Reddy) ఆక్షేపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు.