BJP: కేటీఆర్‌ని ముందు అరెస్ట్ చేయండి.. రేవంత్‌కు రఘునందన్ రావు సవాల్
ABN, Publish Date - Aug 24 , 2024 | 08:54 PM
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపట్టారని.. సీఎం రేవంత్ రెడ్డి వాటిపై ముందు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపట్టారని.. సీఎం రేవంత్ రెడ్డి వాటిపై ముందు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డ్రామాలు రక్తికట్టించేలా మాట్లాడుతున్నారు. 1994కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మిరాలం చెరువు కబ్జాపై స్పందించారు. 2010 లో ఎఫ్టీఎల్, శిఖంలలో ఎవరు ఏం కట్టినా కూల్చివేయాలని కోర్టు చెప్పింది. 157జీవోను 6 /4 2010లో ప్రభుత్వం తీసుకుని వచ్చింది. 18మందితో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరాలం ట్యాంక్ పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలి?. ఎన్ కన్వెన్షన్‌ను 2014లో కూల్చివేయమని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి..? ఎన్ కన్వెన్షన్ వెనుక ఉన్న లాలూచీ ఏంటో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారులతో కలిపి అధికారుల కమిటీ వేశారు. ముందు కేటీఆర్ జన్వాడా ఫాం హౌస్ కూల్చి వేయండి. కవిత, కేటీఆర్ ఫాం హౌస్‌ను కూల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు. హైడ్రా వేసింది మంచి ఉద్దేశ్యంతో అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కట్టడాలు కూల్చి వేయాలి. కబ్జాలను పాల్పడిన నేతలపై కేసులు పెడితే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. రాజ్ భవన్ రోడ్‌లో నాలాలపై ఆసుపత్రి కట్టారు.. భారీ భవనాలను నిర్మించారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోని కేటీఆర్‌ను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలి’ అని రఘునందన్ డిమాండ్ చేశారు.
Updated at - Aug 24 , 2024 | 08:55 PM