Home » TG Govt
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. నిరవధిక సమ్మె దిశగా జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లర్లు అడుగులు వేస్తున్నారు. మిల్లర్లు సమ్మె ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రంలో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షల హాల్‌టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చా యి.
భా రత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో చేరితే దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
ప్రభుత్వం బోనస్ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లు.. సన్న ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువ ఉందనే కారణాలు చూపుతూ.. ధరను తగ్గించేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్లను కేటాయించింది.
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
ఎట్టకేలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ (ఎంపీహెచ్ఏ) నియామక రాత పరీక్ష తేదీ ఖరారైంది. డిసెంబరు 29న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలను సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ అయింది.