దేశాభివృద్ధికి స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగం కండి
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:19 AM
భా రత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో చేరితే దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో దీని పాత్ర కీలకం: గవర్నర్
కవాడిగూడ, నవంబరు 10 (ఆంరఽధజ్యోతి): భా రత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో చేరితే దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ దోమలగూడ గగన్‌మహల్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
క్రమశిక్షణ గల విద్యార్థులను తీర్చిదిద్దడంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందు వరుసలో నిలుస్తుందని, ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి సేవలు అందించే మంచి డాక్టర్లు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లుగా తయారవుతారని అన్నారు. అనంతరం సంస్థ ప్రతినిధులు రూపొందించిన పుస్తకాన్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్ బుర్రా వెంకటేశ్‌తో కలిసి గవర్నర్ ఆవిష్కరించి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.