Home » TG Politics
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ చెంతకు చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి.. తాను కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు.
తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు సెక్రటేరియట్ ముట్టడించేందుకు సర్పంచ్‌లు వెళ్లారు.
మాజీ మంత్రి హరీష్ రావునీ వదిలిపెట్టేది లేదని మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumanth Rao) మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మీడియా సమావేశం నిర్వహించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడివేడిగా జరిగాయి. సభలో మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నిరసన తెలిపారు.
సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది.
రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే 44 లక్షల మందికే రుణమాఫీ చేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.