Share News

Telangana Politics: పంతం నెగ్గించుకున్న నాయకురాలు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:49 PM

సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది.

Telangana Politics: పంతం నెగ్గించుకున్న నాయకురాలు..
Sarita and Bandla

సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఆమె గతంలో జిల్లాపరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గులాబీ పార్టీపై అలకతో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి.. గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినా రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. కానీ అధికార పార్టీ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అందుకే సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బండ్లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దని సరిత తిరుపతయ్య అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా హైకమాండ్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. చివరికి ఆమె కన్నీళ్లు సైతం పెట్టుకుంది. తనను కాదని పార్టీలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముందే హెచ్చరించారు. అయినాసరే పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బండ్ల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన సీఎం రేవంత్ సమక్షంలో జులై నెలలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైకమాండ్ పచ్చజెండా ఊపినా.. గద్వాలలో బండ్లకు సరిత తిరుపతయ్య మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్


తగ్గని ప్రాధాన్యత..

బండ్ల చేరికతో తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని సరిత తిరపతయ్యతో పాటు ఆమె అనుచరులు ఆందోళన చెందారు. కానీ బండ్ల చేరికతో సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొకటైతే.. అయ్యింది మరొకటి అన్నట్లు ఉండటంతో బండ్ల కాంగ్రెస్‌లో కొనసాగలేమని డిసైడ్ అయ్యారట. దీంతో తిరిగి మళ్లీ కేటీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. బండ్ల పార్టీలో చేరినా సరితకు ప్రయారిటీ తగ్గదని అధిష్టానం ముందే చెప్పడంతో ఆమె శాంతించారు. హైకమాండ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకంటే సరిత తిరుపయ్యకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు.. ఎక్కడైనా ఆమె మాటకే విలువ ఇస్తుండటంతో బండ్ల మనస్థానం చెందారట. ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉంటే తమ పనులు ఈజీగా అవుతాయనుకున్న బండ్లకు సరిత తిరుపతయ్య చెక్ పెట్టడంతో.. హస్తం పార్టీ కంటే బీఆర్‌ఎస్‌లో ఉండటమే బెటర్ అనుకుని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరారు. దీంతో ప్రస్తుతం సరిత తిరుపతయ్యతో పెట్టుకుంటే అలా ఉంటాది మరీ అని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

Rahul Gandhi: తెలంగాణలో రైతు రుణమాఫీ.. రాహుల్ గాంధీ కీలక కామెంట్స్..


ఎన్నికలకు ముందు..

గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యవహరంతో విసుగుచెందిన సరిత తిరుపతయ్య ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆ ప్రాంతంలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో హస్తం పార్టీ ఆమెకు తగిన గుర్తింపునిచ్చింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకోగా.. బండ్ల చేరికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. చేరిక అంశంలో సరితా తిరుపతయ్యలకు నచ్చచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే చేరినా, పార్టీ లో మీకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటపై నమ్మకంతో పార్టీలోనే కొనసాగారు సరిత తిరుపతయ్య. కాంగ్రెస్ కండువా కప్పుకుని నెలరోజులు తిరగకముందే సరిత తిరుపతయ్య దెబ్బకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.


Rains: హైదరాబాదీలకు హైఅలర్ట్.. ఆగస్టులో నగరాన్ని వణికించనున్న వరుణుడు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 04:49 PM