Share News

Arvind: రేవంత్ నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..?

ABN , Publish Date - Aug 02 , 2024 | 06:40 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు.

Arvind: రేవంత్ నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..?
Dharmapuri Arvind

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. రాద్దాంతం చేశారు కాబట్టే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుంచి బయట పడేశారని చెప్పారు.


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బయటకు రాకుండా తన అన్న మాజీ మంత్రి కేటీఆర్ చూస్తున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. తమ హైకమాండ్ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదని తేల్చిచెప్పారు. 6 నెలల నుంచి కవిత జైల్లో ఉంది..రెండు కేసుల్లో అరెస్ట్ అయ్యిందని తెలిపారు. రేవంత్ రెడ్డిని గత ప్రభుత్వంలో చాలాసార్లు అరెస్ట్ చేశారు...కానీ గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయ్యిందని చెప్పారు.


రాష్ట్రానికి చీడ పురుగులా బీఆర్ఎస్

‘‘రేవంత్ పౌరుషం ఏమైంది.. గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు ఏమైంది. కమిషన్లు వేయడం కాదు.. మీ చిత్త శుద్ధి నిరుపించుకోండి. రాష్ట్రానికి చీడ పురుగులా బీఆర్ఎస్ ఉండేది..దాన్ని వదిలించుకున్నారు. గులాబీ పార్టీను భూస్థాపితం చేయాలి. బీఆర్ఎస్ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ బీజేపీలో ఐక్యత ఉంది. రైతు రుణమాఫీపై డేటా తీసుకుని ఆ తర్వాత స్పందిస్తాం. రుణ మాఫీ ఒకటే కాదు ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతులు, మహిళలు, యువకులు సీఎం రేవంత్‌ను విమర్శిస్తున్నారు’’ అని అరవింద్ అన్నారు.


అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు

‘‘కేంద్ర బడ్జెట్ గురించి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయనేది అనవసరం. బడ్జెట్ దేశానికి మంచి చేసేలా ఉందని మేధావులు చెబుతున్నారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ. 31 వేల కోట్ల రైల్వే పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ బడ్జెట్‌లో మైనార్టీలకు బడ్జెట్ పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ తగ్గించారు. అధ్యక్ష పదవికి మా పార్టీలో రేసులు ఉండవు. నాకు ఇస్తా అంటే నన్ను పిలిచి మాట్లాడుతారు.. అప్పుడు నా సమాధానం పార్టీ అధిష్ఠానానికి చెబుతా. బీజేపీ అధ్యక్ష పదవి హిందు సామాజిక వర్గానికి ఇస్తే బావుంటుంది. భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ హిందువే. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది నా అభిప్రాయం అడిగితే పార్టీకి చెప్తా’’ అని అరవింద్ పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 06:45 PM