Home » Thanneeru Harish Rao
తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ ( BRS ) నేతలు కేటీఆర్ ( KTR ), హరీష్‌రావు (Harish Rao )ను ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీష్‌రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదన్నారు. బెంజ్ కార్లలో తిరిగే బావబమ్మర్ధులకి పేదల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ అక్రమ పాలన చేస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ( BRS ) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) , మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్‌సభ ( Chevella Lok Sabha ) కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు.
బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ( Parliament Elections ) తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ ( BRS ) కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ... ప్రభుత్వం రాలేదని నిరాశ పడవద్దని .. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని హరీష్‌రావు చెప్పారు.
పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల వసరాలు తీర్చేలా పని చేస్తానని దుబ్బాక బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... 54 వేల మెజార్టీతో తనను గెలిపించి తన మీద చాలా బాధ్యత పెట్టారని కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమోననిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) తెలిపారు. ఆదివారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
భారతీయ పండితుడు, సాహిత్యవేత్త మరియు అవధాని గరికపాటి నరసింహారావు ( Garikapati Narasimha Rao ) ప్రవచనాలు చాలా గొప్పవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న ‘‘చాణక్య విలువలు గరికపాటి నరసింహరావు ప్రవచనాలు’’ కార్యక్రమంలో సోమవారాం నాడు పాల్గొన్నారు.
కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు.
పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) సూచించారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 153మందికి కళ్యాణలక్ష్మీ, జీఓ 59కింద 71మందికి పట్టాల పంపిణీ చేశారు.
క్రైస్తవులకు క్రిస్మస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో క్రిస్టిమస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.