Harish Rao: రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 14 , 2024 | 02:54 PM
తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.
సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
ఈ వార్త కూడా చదవండి: Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
‘‘సరస్వతి అక్క మన మధ్య లేకపోవడం, కేన్సర్ వచ్చి చనిపోవడం బాధాకరం. 23 సంవత్సరాల ప్రజా జీవితంలో ఆమె ఉన్నారు. లీడర్ల రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదిస్తారని అంతా అనుకుంటారు.. 2021లో తెలంగాణ ఉద్యమంలో సరస్వతి గెలిచారు. మనుషులు ఎప్పుడు శాశ్వతం కాదు.. పుట్టినవారు గిట్టక మానదు. మనం చేసిన మంచి పనులే ప్రజల్లో ఉంటాయి. మూడు మండలాల ఎంపీపీలు ఆ రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మద్దతిచ్చారు. ఆ రోజుల్లో పార్టీలు మారాలని ఒత్తిడి చేసిన కేసీఆర్ కోసం వారు పార్టీలు మారలేదు. కేసీఆర్ అడుగు జాడల్లో సరస్వతి నడిచారు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు
Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్
Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!
Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి
Read Latest Telangana News and Telugu News