Home » Tirumala Laddu Controversy
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేవ దేవుడి మేల్కొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు.. ఆగమ శాస్త్రాల నుంచి సనాతన ధర్మం వరకు.. లడ్డూ పోటు నుంచి వెంగమాంబ సత్రంలో జరిగే నిత్యాన్నదానం వరకూ తనతో జగన్ సొంత టీవీలో డిబేట్కు సిద్ధమా అని వల్లూరు జయప్రకాశ్ నారాయణ సవాల్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడి గెలవలగలరా అని నిలదీశారు.
శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.
ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.
ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్ర జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి..