Home » Tirumala Tirupathi
తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడిసరుకులు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పరిశీలించి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవీ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోణితో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్‌ను రాజకీయం చేశారని అన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
భక్తులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారు. అనుమానం వచ్చి నెయ్యిని ల్యాబ్‌కు పంపించగా గత పాలకుల బండారం బయట పడింది.
వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ (బుధవారం) తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్‌కు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్ లైన్ కోటా టికెట్లు విడుదలవుతాయి.
తిరుమల దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు.
తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు.