Share News

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్‌డేట్.. మరికొద్దిసేపట్లో..

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:55 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇవాళ (బుధవారం) తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్‌కు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్ లైన్ కోటా టికెట్లు విడుదలవుతాయి.

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్‌డేట్.. మరికొద్దిసేపట్లో..

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇవాళ (బుధవారం) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్ లైన్ కోటా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవడానికి భక్తులకు అవకాశం ఉంది.

ఇక ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా సేవా టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు రిలీజ్ అవుతాయి. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల కానున్నట్టు టీటీడీ తెలిపింది.


మరోవైపు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదలవనున్నట్టు టీటీడీ పేర్కొంది.


ఇక పౌర్ణమి సందర్బంగా నేటి (బుధవారం) సాయంత్రం గరుడ వాహన సేవ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

Updated Date - Sep 18 , 2024 | 07:57 AM