Home » Tirupathi News
Nara Devansh Birthday: నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబ సమేతంగా తిరుపతికి(Tirupati) రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం నాడు లోకేష్-బ్రాహ్మణి(Lokesh-Brahmani) దంపతుల తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నారా ఫ్యామిలీ మొత్తం తిరుమలకు రానున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనుండగా..
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు.
తిరుపతి : తిరుపతి అసెంబ్లీ సీటుపై లోకల్, నాన్ లోకల్ వార్ నెలకొంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు.
జయహో బీసీ సభలో వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డిపై టీడీపీ చిత్తూరు అభ్యర్థి గురుజాల జగన్(Guruja Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతుకు తెరువు కోసం ప్రక్క రాష్ట్రం వెళ్లి సంపాదించి, పక్కాగా ట్యాక్స్ కట్టి సంపాదించానని అన్నారు. రెడ్ శాండిల్‌ను స్మగ్లింగ్ చేసి సంపాదించిన వ్యక్తి చిత్తూరు వైసీపీ అభ్యర్థి అని చెప్పారు.
మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మహిళలు ముందుకొస్తారని.. పురుషులు వెనక్కి వెళ్తారని చెప్పారు.
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగిరిన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్‌తో వీడియోల చిత్రీకరణ నిర్వహించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడుకు చెందిన యువకులున్నట్టు తెలుస్తోంది.
సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మలికా గర్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్టు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించేసిన జగన్ ప్రభుత్వం.. ఆమెను సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్‌ను నియమించింది.
తిరుమలలో నేడు (శనివారం) భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. నేడు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంటిలో సోమవారం నాడు భారీగా బంగారాన్ని చోరీ చేశారు. సుమారుగా 113 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.