Share News

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

ABN , Publish Date - May 18 , 2024 | 03:57 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది. దీంతో ఈ పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని.. మూడు పోస్టులకు ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపించింది.


ఈ రోజు(శనివారం) ఉదయం మళ్లీ సీఎస్ జవహర్‌రెడ్డికి ఎన్నికల కమిషన్ లేఖ పంపించింది. ఒక్కో ఎస్పీ పోస్ట్‌కు ముగ్గురు పేర్ల చొప్పున ప్యానల్ పంపాల్సిందేనని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కో ఎస్పీ పోస్ట్‌కు ముగ్గురేసి అధికారుల పేర్లను సీఎస్ పంపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లోపు అధికారులను ఎన్నికల కమిషన్ నియమించనున్నది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీ పోస్ట్‌లకు ఎన్నికల సంఘం సాయంత్రంలోగా ఎస్పీలను నియమించే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీని ఎన్నికల కమిషన్ ఈ రోజు(శనివారం) నియమించింది. మరోవైపు ఇప్పటివరకు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న తొలేటి శివశంకర్‌ను ఇటీవల ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. పల్నాడులో జరిగిన హింసాత్మక సంఘటనలు నేపథ్యంలో శివశంకర్‌ను ట్రాన్స్ ఫర్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

వైసీపీ పోలీసింగ్‌పై కొరడా!

AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..

Read more AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 04:18 PM