Share News

AP Election 2024: జవహర్ సీఎస్‌గా ఉంటే.. ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు: జనసేన

ABN , Publish Date - May 22 , 2024 | 06:19 PM

కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP Election 2024: జవహర్ సీఎస్‌గా ఉంటే.. ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు: జనసేన
Jana Sena

తిరుపతి: కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఈసీకి రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతిలోని జనసేన కార్యాలయంలో కిరణ్ రాయల్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఏపీలో అల్లర్లు, అరాచకాలను ఆపడంలో సీఎస్ జవహర్‌రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు.


సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. జవహర్ రెడ్డి నిన్న (మంగళవారం) వైజాగ్‌కు రహస్యంగా ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. అల్లర్లపై సిట్ దర్యాప్తు సరిగ్గా లేదని చెప్పారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో అమాయకులను అక్రమంగా అరెస్టు చేశారని కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 06:35 PM