Home » Tirupati
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావును (Syamala Rao) ఏపీ ప్రభుత్వం (AP Govt) నియమించిన విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) గరుడాళ్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల..క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరహాస్వామిని దర్శించుకున్నారు.
రాష్ట్రంలో జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాల తో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదేసమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు.
శ్రీవారిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి (H.D.Kumaraswamy) శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
విషవాయువులు పీల్చి 35మంది కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం చింతలపాళెం టోల్ప్లాజా- రాజులపాళెం మధ్య సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారాన్ని త్వరలో ప్రారంభించేందుకు యంత్రాల పనితీరుపై వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఏవీ శేషసాయి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
రాజులపాలెం మండలం ఏర్పేడు సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్(Gas leak) కావడంతో సుమారు 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
ఈవీఎం ధ్వంసంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇలాంటి తీర్పు వచ్చి ఉండదని.. ఉన్నత న్యాయస్థానాలు ఈ తీర్పుపై పునరాలోచించాలని కోరారు.