CPI: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం: రామకృష్ణ
ABN , Publish Date - May 24 , 2024 | 01:58 PM
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్‌పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
తిరుపతి: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor Dist.)లో స్ట్రాంగ్ రూమ్ (Strong Room)వద్ద కాండిడేట్‌పై (Candidate) హత్యయత్నం (Attempted Murder) జరగడంపై పోలీసులు (Police) సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ (CPI) నేత రామకృష్ణ (Ramakrishna) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి (Tirupati)లోఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గులేకుండా కాకి డ్రెస్ వేసుకుని అమ్ముడు పోయారని దుయ్యబట్టారు. సకల పాపాల భైరవుడు డీజీపీ (DGP), పోలీసులు ఒకవైపు పూర్తిగా మోకరిల్లటం వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరో కూడా కనీసం తెలియదని, కానిస్టేబుల్ కూడా లెక్క చేయని పరిస్థితి అని, ఈ ఖ్యాతి మొత్తం సీఎం జగన్ రెడ్డికే (CM Jagan) దక్కుతుందని ఆయన అన్నారు.
రాబోయే ప్రభుత్వం కూడా పోలీసుల్ని అనవసరంగా వినియోగించవద్దని కోరుతున్నామని, వారి డ్యూటీని వారు చేయనియ్యాలని రామకృష్ణ సూచించారు. 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ప్రతి నియోజకవర్గంలో ఓటుకి రూ. 3వేలు, పోస్టల్ బ్యాలెట్‌కు రూ. 5వేల చొప్పన ఇచ్చారని ఆరోపించారు. ఈసీ ఏం చేస్తోంది? వారు కూడా అమ్ముడు పోయారా? అని ప్రశ్నించారు. ఈసీ కూడా డబ్బులు తీసుకుంది కాబట్టి ఎక్కడ డబ్బుల పంపిణీని నిరోధించలేదని విమర్శించారు.
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ఇంటి వద్ద డబ్బులు ఇవ్వలేదని కొందరు ధర్నా చేశారని, 2029 లో డబ్బులు ఇవ్వలేదంటే జనం అభ్యర్థుల ఇంటికి వచ్చి కొడతారని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశానని రామకృష్ణ అన్నారు. వీటిపై పార్టీలకతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి ఓట్లు కొన్న తర్వాత ఓటర్లను ఎమ్మెల్యే ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడతారని, ఎర్రచందనం, గంజాయి, ఇసుక ఇలాంటివన్నీ అమ్ముతారని, ధనస్వామ్యం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని
బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!
పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్
Read Latest APNews and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News