Home » Tirupati
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. రాష్ట్రమంతటా ప్రచార జోరు కొనసాగుతోంది. ఒక్క తిరుపతిలో మాత్రం ప్రధాన పార్టీలను పోలీసులు ప్రచారం చేయనివ్వకుండా నిలువరించడంతో ఇక్కడ వాతావరణం సైలెంట్‌గా మారిపోయింది. కాంగ్రెస్, వామపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నా.. పెద్దగా జోష్ అయితే కనిపించడం లేదు.
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
తిరుపతి: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూచించారు
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
Andhrapradesh: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని మట్టి, ఇసుక, భూ కబ్జాలతో పేట్రేగిపోతున్నారని విమర్శించారు.
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు...
తిరుపతిలో డూప్లికేట్, దొంగ ఓట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కే మీనాకు జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లు నమోదు చేయించుకుని ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.