AP Elections: ఏపీలో అక్కడ మాత్రం ప్రచారం నిల్.. డీలా పడిన ప్రధాన పార్టీలు..
ABN , Publish Date - Apr 29 , 2024 | 10:58 AM
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. రాష్ట్రమంతటా ప్రచార జోరు కొనసాగుతోంది. ఒక్క తిరుపతిలో మాత్రం ప్రధాన పార్టీలను పోలీసులు ప్రచారం చేయనివ్వకుండా నిలువరించడంతో ఇక్కడ వాతావరణం సైలెంట్‌గా మారిపోయింది. కాంగ్రెస్, వామపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నా.. పెద్దగా జోష్ అయితే కనిపించడం లేదు.
తిరుపతి: ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. రాష్ట్రమంతటా ప్రచార జోరు కొనసాగుతోంది. ఒక్క తిరుపతిలో మాత్రం ప్రధాన పార్టీలను పోలీసులు ప్రచారం చేయనివ్వకుండా నిలువరించడంతో ఇక్కడ వాతావరణం సైలెంట్‌గా మారిపోయింది. కాంగ్రెస్, వామపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నా.. పెద్దగా జోష్ అయితే కనిపించడం లేదు. అసలే ఎన్నికలు ఎన్నో రోజులు లేవు. ఈ తరుణంలో ప్రచారాన్ని అడ్డుకోవడంతో ప్రధాన పార్టీలు కొంత మేర డీలా పడ్డాయి. అసలు ఎన్ని రోజుల పాటు నిలువరిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నాయి.
AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..
రెండు రోజుల క్రితం తిరుపతి గిరిపురంలో జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్న ప్రచారాన్ని వైసీపీ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎన్డీఏ, వైసీపీ ఇరు పార్టీల ప్రచారాన్ని ఎన్నికల సంఘం నిలిపేసింది. అభ్యర్థులే కాదు, అభ్యర్థుల తరఫున ఎవరు ప్రచారం చేసినా వార్డుల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ఆంక్షలు ఇంకా ఎన్ని రోజులనేది ఎన్నికల సంఘం స్పష్టం చేయడం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ప్రచారాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కేవలం వైసీపీ, ఎన్డీఏల ప్రచారాన్ని మాత్రమే పోలీసులు అడ్డుకుంటున్నారు.
Read Latest AP News and Telugu News