Congress: బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: డాక్టర్ చింతామోహన్
ABN , Publish Date - Apr 24 , 2024 | 01:51 PM
తిరుపతి: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూచించారు
తిరుపతి: బీజేపీ (BJP) మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ (SC), ఎస్టీ (ST), ఓబీసీ (OBC), మైనార్టీలకు (Minorities) రిజర్వేషన్లు (Reservations) రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ (RSS) కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) డాక్టర్ చింతామోహన్ (Dr. Chinta Mohan) సూచించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన తిరుపతి (Tirumati)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందని, ఈసారి బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమవుతుందని అన్నారు.
మేకప్ లేనిదే మోదీ (PM Modi) బయటకు రారని, ఆయన మేకప్ ఖర్చురోజుకు రూ.20 వేలు అవుతుందని చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలోని టీడీపీ (TDP), వైసీపీ (YCP) పార్టీలు మోదీ, అమిత్ షా (Amit Shah) జేబులోకి వెళ్లిపోయాయని విమర్శించారు. రాబోయే పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల గాలి వీస్తోందన్నారు.
కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చింతామోహన్ అన్నారు. రైతుల పండించే పంటలకు మద్దతు ధర కోసం చట్టం చేస్తామని, ప్రతి నిరుపేద మహిళలకు ఉచితంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులకు రూ. 30 వేలు, పీజీ విద్యార్థులకు రూ. 40వేలు స్కాలర్‌షిప్ అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చింతామోహన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..: హరీష్ రావు
పెనుకొండలో వైసీపీకి భారీ షాక్..
తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
మనసులో మర్మాన్ని బయటపెట్టిన సీఎం జగన్: రామకృష్ణ
డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు
కడప జిల్లా కోర్టు గీత దాటింది!
Read Latest AP News and Telugu News
National News, Telangana News, Sports News