Home » Toll Rates
టోల్ పాయింట్ల వద్ద ఏకపక్షంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
ఔటర్ రింగ్ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్‌ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది.
జాతీయ రహదారులపై టోల్ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.