Share News

Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త.. 1 నుంచి టోల్‌ బాదుడు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 07:51 AM

వాహనదారులకు నిజంగా ఇది పిడుగు లాంటి వార్తే. ఏప్రిల్ 1వతేదీ నుంచి మళ్లీ టోల్ గేట్ రుసులు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్థయం తీసుకుంది. రూ.5 నుండి రూ.25 వరకు పెంచనున్నారు. ఒకటో తేదీనుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.

Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త..  1 నుంచి టోల్‌ బాదుడు..

- రాష్ట్రవ్యాప్తంగా టోల్‌గేట్ల రుసుము పెంపు

చెన్నై: రాష్ట్రంలోని టోల్‌గేట్ల(Tollgates)లో వాహనాల రుసుమును రూ.5 నుండి రూ.25 వరకు పెంచనున్నారు. ఈ పెంచిన రుసుము ఏప్రిల్‌ ఒకటి నుండి వర్తింపజేయనున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 76 టోల్‌గేట్లున్నాయి. గత రెండేళ్లలో కొత్తగా 12 టోల్‌గేట్లు తెరిచారు. వీటిలో 40 టోల్‌గేట్లలో ఏప్రిల్‌ ఒకటి నుండి టోల్‌ గేట్‌ రుసుమును రూ.5 నుంచి రూ.25 దాకా పెంచనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: IMD: నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి


తక్కిన 48 టోల్‌గేట్లలో సెప్టెంబరు ఒకటి నుండి రుసుము పెంచనున్నారు. నగరంలోని వానగరం, సూరపట్టు టోల్‌గేట్‌, చెన్నై - కోల్‌కతా(Chennai - Kolkata) రహదారిలోని నల్లూరు టోల్‌గేట్‌, తాంబరం - దిండివనం మార్గంలోని ఆత్తూరు టోల్‌గేట్‌, పరనూరు టోల్‌గేట్లలో ఈ కొత్త రుసుము అమలులోకి రానున్నాయి. దీనివలన వల్ల కాయగూరులు, కిరాణా సరకుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


nani2.jpg

మహారాష్ట్ర నుంచి చెన్నై(Maharashtra to Chennai)కి సరకులను లారీలో తీసుకువచ్చేందుకు టోల్‌గేట్‌ రుసుము కనీసం రూ.1000లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు, లారీ బాడుగలు కూడా పెరుగుతాయని లారీ యజమానుల సంఘం నాయకులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 07:51 AM