Toll Fee: కేంద్రమంత్రి గడ్కరీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు వినతి
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:48 PM
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
ఢిల్లీ: జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు (TDP MP Appala Naidu) స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
మినహాయించండి
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్. సమాజం పట్ల జర్నలిస్టులు అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ఇందుకు అక్రిడెటేషన్ ఉన్న విలేఖరులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల జర్నలిస్టులకు మేలు జరుగుతోందని వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతోన్న తప్పులను వేగంగా తెలుసుకునే అవకాశం పెరుగుతోందని అప్పల నాయుడు గుర్తుచేశారు.
సుదూరం ప్రయాణం
కొన్ని సందర్భాల్లో వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు సుదూరం ప్రయాణించాల్సి వస్తోందని ఎంపీ అప్పల నాయుడు వివరించారు. అందుకోసం తమ సొంత ఖర్చులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయిస్తే మేలు జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. సమాజ శ్రేయస్తు కోసం, అంకితభావంతో.. నిబద్ధతో పనిచేసే జర్నలిస్టుల కోసం తన విన్నపాన్ని ఆలోచించాలని మరి మరి కోరారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ మొమోరాండం సమర్పించారు. అప్పలనాయుడు చేసిన వినతికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి....
TS News: ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్
Harish Rao: చంద్రబాబు అత్యంత శక్తివంతుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలోనే..
Read Latest Andhra Pradesh AND Telugu News