Home » Traffic Police
పొద్దంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో మొదలై.. కొద్దిసేపటికే వాన జోరందుకుంది.
రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు. ట్రాఫిక్‌జామ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలన్నారు.
హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ నిర్వహణను ఇక ’గగన నేత్రం’ ద్వారానూ పర్యవేక్షనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సౌజన్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘థర్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’ను అభివృద్ధి చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్(hyderabad)లో దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి (rain) అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.