BMW Car: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:51 AM
Car Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఏకంగా ట్రాఫిక్ పోలీస్ బూత్ డివైడర్‌ను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బీఎండబ్ల్యూ కారు మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కారుపై రెండు పెండింగ్ చలాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ట్రాఫిక్ జామ్ అవకుండా కారును అక్కడ నుంచి తొలగించారు. అయితే కారు ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరి పేరుపై రిజిస్ట్రర్ అయి ఉంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో ట్రాఫిక్ పోలీస్ బూత్ గోడ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు అక్కడకు చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో రిజస్ట్రర్ అయిన ఉన్న ఈ కారు నెంబర్ టీఎస్ 09 ఎఫ్‌ఐ9990గా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
అనంతరం డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. మద్యం సేవించడం వల్ల ప్రమాదం జరిగిందా.. లేక కారు బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు చెప్పవచ్చు. పగటి పూట ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో కారు రావడం వల్లే డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఈ ప్రమాదంపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారును స్టేషన్‌కు తరలించారు. కారు వివరాలు తెలుసుకుని యాజమాన్యానికి సమాచారం అందించారు పోలీసులు.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News