Heavy Traffic Jam: విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా.. బిగ్ అలర్ట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:58 AM
Telangana: హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.
నల్గొండ: సంక్రాంతి పండుగకు వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి ప్రజలకు వారి సొంతూర్లకు వెళ్లారు. సెలవులు అయిపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం నెలకొంటుంది. ట్రాఫిక్ జాం అవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రజలు ఎక్కువగా తిరుగుముఖం పట్టారు. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద సర్వర్లు మొరాయిస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ఐదు లైన్ల ద్వారా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
స్కానర్లు పనిచేయక టోల్ బూత్ గేట్లు తెరచుకోవడం లేదు. క్యూ లైన్‌లో ఉండి హారన్‌లు కొడుతున్న టోల్గేట్ సిబ్బంది పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ నెలకొంది.కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరుగు హైదరాబాద్‌కు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను దారి మళ్లించారు. రైల్వే బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ ఇరుక్కుపోయింది. సంఘటన స్థలానికి డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకున్నారు. అతికష్టం మీద కంటైనర్‌ను బయటకు తీసి ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్
Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..
Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు
Read Latest Telangana News And Telugu News