Home » Traffic rules
హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ నిర్వహణను ఇక ’గగన నేత్రం’ ద్వారానూ పర్యవేక్షనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సౌజన్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘థర్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’ను అభివృద్ధి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా 12వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.
ఒక్క అడుగు ముందుకు కదలాంటే ఐదు నిమిషాలు.. కిలోమీటర్ ప్రయాణానికి ఏకంగా 45 నిమిషాల సమయం. ఇదీ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు45(Jubilee Hills Road No.45)లోని వాహన చోదకుల పరిస్థితి.
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.
తన కుమారుడి చేత పాలిసెట్ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..
హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) తెలిపారు. విజయయాత్ర మంగళవారం ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది.
శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.