Home » Tribute
తెలుగుదేశం నేత, లోక్ సభ తొలి దళిత స్పీకర్‌గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్‌గా ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు.
దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ)ఏర్పాటు చేశారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, రవీంద్రభారతి, లలితకళల అకాడమీ కూడా అప్పుడే నెలకొన్నాయి. టీచర్లకూ పింఛన్, అప్పట్లో ఉపాధ్యాయులకు పింఛను సౌకర్యం లేదు. బతకలేక బడి పంతులు అని.. బాధపడే రోజులవి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు.
అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని సోమవారం టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిం చారు. సోమవారం స్థానిక క్లాక్ టవర్ సమీ పంలోని మౌలానా విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్మొద్దీన, నాయకులు సైఫుద్దీన, ఫిరోజ్ అహ్మద్, తాజుద్దీన, సరిపూటి రమణ, కురబ నా రాయణస్వామి, మణికంఠ బాబు, ఓంకార్రెడ్డి, సరి పూటి శ్రీకాంత తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసారభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.