Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:00 AM
అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

అమరావతి: మహాత్మాగాంధీ (Mahatma Gandhi)77వ వర్ధంతి (77th Death Anniversary ) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా నివాళులర్పిస్తూ (Tribute) ట్వీట్ (Tweet) చేశారు. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాత:స్మరణీయుడని అన్నారు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని అన్నారు. జాతిపితకు మరొక్కసారి ఘన నివాళి అర్సిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
మంత్రి లోకేష్ నివాళి..
సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరని, తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారని, భారతదేశంపై చెరగని ముద్ర వేశారన్నారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషిచేద్దామని మంత్రి లోకేష్ అన్నారు.
నేడు మాంసం దుకాణాలు బంద్
కాగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
ఈ వార్త కూడా చదవండి..
నేటి నుంచి వాట్సాప్ పరిపాలన..
ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడనిదే మనకు రోజు మొదలవ్వదు. వాట్సా్‌పలో ఎన్ని మెసేజ్‌లున్నాయో చూస్తాం. స్టేటస్ ఏం పెట్టాలో అని ఆలోచిస్తాం. స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారందరి దైనందిన జీవితంలో వాట్సాప్ కూడా ఓ భాగమైపోయింది. అలాంటి మాధ్యమాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు సులువుగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాలనలో సరికొత్త ఆవిష్కారానికి శ్రీకారం చుడుతూ వాట్సాప్ పాలనను గురువారం నుంచి అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు అందించనున్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆర్టీజీఎస్ సీఈవో దినేశ్‌కుమార్ తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనిని మానవ వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని సీఎం చెప్పారు. ఈ సేవల కోసం ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబరును ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని తెలిపారు. ఆ నంబరుకు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) కూడా ఉంటుందన్నారు. ఈ నంబరు వన్‌స్టా్‌ప సెంటర్‌లా పనిచేస్తుందని అన్నారు. తొలి దశలో 161 సేవలు అందుబాటులోనికి వస్తాయని, క్రమేపీ ఈ సేవలు పెరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు విస్తరిస్తూ.. పాలనలో మరింత సౌలభ్యాన్ని తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు.
మెటాతో ఒప్పందం
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా వినతిపత్రాలు పట్టుకు తిరిగినా ఫలితం ఉండటంలేదంటూ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, మునిసిపల్, ఎండోమెంట్ సర్వీసులలో ఎదురయ్యే ఇబ్బందులతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా వాటిని మెజారిటీ ప్రజలు నేరుగా వినియోగించుకోలేక పోతున్నారు. గతంలో ఆర్టీజీఎస్ సర్వేలో ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వెల్లడైంది. ఇది గుర్తించిన ప్రభుత్వం నేరుగా ప్రజల ఫోన్ ద్వారానే సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని గుర్తించింది. వాట్సాప్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించింది. దీని కోసం గతేడాది అక్టోబరు 22న వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో మంత్రి లోకేశ్ కీలకపాత్రను పోషించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే సంబంధిత కార్యాలయాల అధిపతులకు వాట్సాప్ చేరుస్తుంది. దాని స్టేటస్ ఏమిటో కూడా అర్జీదారులకు తెలియజేస్తుంది. దీనివల్ల రోజుల కొద్దీ ఫైళ్లు బూజుపట్టే పరిస్థితి లేకుండా వెనువెంటనే సమస్యలు పరిష్కారమవుతాయి. వాట్సప్ ద్వారా సేవలందిస్తే పాలనపై చాలా వరకు సంతృప్తి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..
ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
చీకట్లో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News