Tribute: స్వాతంత్ర్య సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:18 PM
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు.. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. వీరి పేర్లు వింటేనే భారతీయుల రక్తం దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా, తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు.

అమరావతి: భారతజాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే వీరోచిత పోరాటలు చేసి.. యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్య్ర సమర వీరులు భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్ గురు (Rajguru), సుఖ్ దేవ్ (Sukhdev)లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివాస్ సందర్భంగా ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారి సంస్మృతికి నివాళులర్పిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.
Also Read..:
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు సూచన..
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి..
భగత్ సింగ్ సుఖ్ దేవ్, రాజ్ గురు. వాళ్ల పేర్లు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలనే ఆర్పించారు. అలాంటి త్యాగమూర్తులను ఈ రోజు మన దేశం స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వేచ్ఛ, న్యాయం కోసం వారు నిర్భయంగా చేసిన కృషి మనందరికీ స్ఫూర్తి అని ఆయన అన్నారు. ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారికి ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు.
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు.. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. వీరి పేర్లు వింటేనే భారతీయుల రక్తం దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అలాంటి దేశభక్తులను ఉరి తీసిన రోజు నేడే. 23 మార్చి, 1931న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసింది. 17, డిసెంబర్ 1928న బ్రిటన్ అధికారి శాండర్స్‌ను హత్య చేయడం, పార్లమెంట్‌లో బాంబులు వేయడం వంటి కారణాలను చూపి ముగ్గురినీ ఉరితీశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా ఆ రోజును అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్)గా జరుపుకుంటారు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా, తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు. అలాగే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు సైతం దేశ స్వేచ్ఛ కోసం సంతోషంగా ప్రాణాలను త్యాగం చేశారు. వారి ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర పోరాటం మరింతగా విజృంభించింది. వారిని ఉరితీశారని తెలుసుకున్న ప్రతి భారతీయుడూ కథం తొక్కాడు. లక్షలు, కోట్లుగా రోడ్లపైకి వచ్చి ఆందోళకు దిగారు. ఎట్టకేలకు బ్రిటీష్ సామ్రాజ్య మెడలు వంచి దేశానికి విముక్తి కల్పించారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల బలిదానం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. భారత్ విముక్తికి బాటలు వేసింది. దీంతో ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వారి త్యాగాలను స్మరించుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్..
కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..
For More AP News and Telugu News