Tripura: రైల్వేస్టేషన్‌లో బంగ్లాదేశీయులు అరెస్ట్
ABN , Publish Date - Jul 28 , 2024 | 08:04 PM
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
అగర్తలా, జులై 28: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరంతా 19 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులని పోలీసులు తెలిపారు. వీరి స్వస్థలం బంగ్లాదేశ్ చపైనవాబ్‌గంజ్ జిల్లాలోని రాజ్‌షషి డివిజన్ అని స్పష్టం చేశారు.
Union Minister: కేంద్ర మంత్రి కుమార స్వామికి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
Also Read: Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?
Also Read: Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు
మరోవైపు బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. వారికి ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఉద్యమం ఉరకలెత్తుతోంది. ఆ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయినా హింస మాత్రం తగ్గలేదు. అలాంటి వేళ.. ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యార్థులతో చర్చలు జరిపేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హింస వల్ల బాధితులుగా మారిన వారికి కోల్‌కతా ఆశ్రయం కల్పిస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
Also Read: Delhi UPSC aspirants death: ఆప్ ప్రభుత్వమే లక్ష్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విమర్శలు
Also Read: Uttar Pradesh: అఖిలేష్ రాజీనామా.. కొత్త ప్రతిపక్ష నేత ఎంపిక
ఈ ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడ్డారు. చివరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైతం స్పందించారు. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం నోట్ సైతం పంపింది. అయితే ఈ ఏడాది చివరల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించేందుకు ఎత్తుగడ వేశారని.. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్
Read More National News and Latest Telugu News