Share News

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:50 PM

MPs Vs MLAs: ఎంపీల జీతాలు ఇటీవల కేంద్రం పెంచింది. అయితే ఎంపీల జీతాల కంటే.. ఎమ్మెల్యేల జీతాలే అత్యధికంగా ఉన్నాయి. అదీకాక ఎన్నికల వేళ.. ఎంపీ సీటు కంటే.. ఎమ్మెల్యే సీటుకే డిమాండ్ అధికంగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

ఎంపీల జీతాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచింది. 24 శాతం మేర వారి జీతాలను పెంచింది. దీంతో ప్రతి నెల ఒక్కో ఎంపీ ఇకపై రూ.1.24 లక్షలను జీతంగా అందుకోనున్నారు. ఇది 2023, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ బకాయిలను త్వరలో విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్కో ఎంపీకి రూ.లక్ష మాత్రమే వేతనంగా ఉండేదన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఎంపీలకు వారి జీతమే కాకుండా ఇతర అలవెన్సులు సైతం లభిస్తాయి. రోజువారీ భత్యం ఇకపై రూ.2 వేలు కాకుండా..వాటిని రూ.2,500కు పెంచారు. అలాగే మాజీ ఎంపీలకు ప్రతి నెలా రూ.31 వేలు పెన్షన్‌గా అందించనున్నారు. లోక్‌సభ లేదా రాజ్యసభ ఎంపీగా మరో మారు పదవీ కాలం ఐదు సంవత్సరాలను పూర్తి చేస్తే, వారి పెన్షన్ మొత్తానికి అదనంగా మరో రూ.2,500 ఇస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ మొత్తం రూ.2 వేలుగా ఉండేదన్న విషయం తెలిసిందే.


ఇక నియోజకవర్గం కార్యాలయం..

ప్రతి ఎంపీకి రూ.87 వేలు నియోజకవర్గ భత్యంతోపాటు రూ.75 వేలు కార్యాలయ ఖర్చుల కోసం మంజూరు చేస్తారు. ఇక కార్యాలయంలో ఫర్నిచర్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. వీటితోపాటు ఉచిత విమాన, రైలు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తారు.


మరోవైపు ఎంపీల కంటే ఎమ్మెల్యేలకే జీతం అధికమా? అంటే..

దేశంలో ఎమ్మెల్యేల అత్యధిక జీతం గురించి మాట్లాడుకుంటే మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ ఎమ్మెల్యేల జీతం నెలకు రూ.20 వేలు. వీటితో అలవెన్సులు కలిపి నెలకు రూ.2.50 లక్షలు పొందుతారు. ఇక ఎమ్మెల్యేల జీతాల విషయంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడి ఎమ్మెల్యేలు జీతభత్యాలు కలిపి నెలకు రూ. 2.10 లక్షలుగా ఉన్నాయి.

అయితే ఎంపీల వలే.. ఎమ్మెల్యేలకు జీతాభత్యాలే కాకుండా.. రాష్ట్ర రాజధానిలో వసతి, ప్రయాణభత్యం, రోజు వారీ భత్యంతోపాటు ప్రయాణ సౌకర్యాలను సైతం కల్పిస్తారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ప్రతి నెల రూ. 1.87 లక్షల జీతంగా అందుకుంటున్నారు.ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎమ్మెల్యేలు ప్రతి నెల రూ. 34 వేలు జీతంగా తీసుకొంటున్నారు. దేశంలో అత్యల్ప జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలగా త్రిపుర రాష్ట్రం చిట్ట చివరి స్థానంలో నిలిచింది.


ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ..

ఒక్క లోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాలుంటాయి. అంటే ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్క ఎంపీ ఉంటారు. అయినా.. ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతమే అధికంగా ఉండడం గమనార్హం. అదీకాక.. ఎన్నికల వేళ.. ఎంపీ స్థానాని కంటే.. ఎమ్మెల్యే పదవికి పోటీ పడే వారి సంఖ్యే అధికంగా ఉంటుందన్న విషయం.. తెలుగు రాష్ట్రాల రాజకీయం చూస్తే ఇట్టే తెలుస్తోంది. ఎంపీ అయితే.. తన లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను పట్టించుకోవాల్సి ఉంటుంది.

అలాగే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పలుమార్లు ఢిల్లీకి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయితే ఉంటే నియోజకవర్గంలో ఉంటారు. లేకుంటే అసెంబ్లీ సమావేశం కోసం రాజధానికి వెళ్తారు. దీంతో నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకం కావచ్చుననే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే పదవికి డిమాండ్ ఉందనే అభిప్రాయం తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:51 PM