Home » TS Politics
Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్..
Telangana: ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి మంచి సాంప్రదాయాన్ని పాటించారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని మండిపడ్డారు.
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.