Share News

Malreddy Rangareddy: సీఎం రేవంత్ మర్యాదిస్తే.. ప్రధాని నిలబెట్టుకోలేదు

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:04 PM

Telangana: ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి మంచి సాంప్రదాయాన్ని పాటించారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని మండిపడ్డారు.

Malreddy Rangareddy: సీఎం రేవంత్ మర్యాదిస్తే.. ప్రధాని నిలబెట్టుకోలేదు

హైదరాబాద్, మార్చి 5: ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంచి సాంప్రదాయాన్ని పాటించారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఒక్కటే అని ప్రధాని వ్యాఖ్యానించడం సరైనది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలపైన రేవంత్ రెడ్డి గతంలో కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. భూఆక్రమణలు, ప్రాజెక్టుల్లో అక్రమాలు,అవినీతిపైన చేసిన ఫిర్యాదులను కేంద్రం చెత్త బుట్టలో వేసిందన్నారు. పార్లమెంటులో బీజేపీకి (BJP) బీఆర్ఎస్ అనేక సార్లు మద్దతు పలికిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని మండిపడ్డారు.

Chandrababu: నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ


కాళేశ్వరం (Kaleshwaram Project) కేసీఆర్ (BRS Chief KCR) కుటుంబానికి ఏటీఎం అని విమర్శించిన ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపైన విజిలెన్స్ విచారణ జరిపిస్తుంది తమ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. కేసీఆర్‌ను కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వమే అని ఆరోపించారు. ‘‘లిక్కర్ స్కాంలో కవితను (BRS MLC Kavitha) ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమెను కాపాడుతున్నది ఎవరు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను జైలుకు పంపినప్పుడే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి...

Atchannaidu: జగన్.. పగటి కలలు కంటున్నారు..

Rahul Gandhi: ఫోన్ చూడండి.. జై శ్రీరాం అనండి.. ఆకలితో చావండి.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 05:04 PM